Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

సత్యమే ఆయుధం…. అహింసే మార్గం.. ఘనంగా కేజీబీవీ పద్మనాభంలో గాంధీ జయంతి వేడుకలు

విశాఖపట్నం జిల్లా,పద్మనాభం, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) ::
ప్రిన్సిపాల్ శ్రీమతి గ్రేస్ లిల్లీ గారి ఆదేశాల మేరకు పద్మనాభం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. SMC చైర్మన్ చెలపాక ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి కార్యక్రమంగా ఈ వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ కాళ్ల నగేష్ కుమార్, PASC చైర్మన్ మకర అన్నమయ్య, మండల సభ్యులు సుంకర పైడినాయుడు, మాజీ ఎంపీటీసీ బొడ్డు శ్రీను, రాష్ట్ర నాగవంశ కోశాధికారి మొకర సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అతిథులు సూచించారు

హైలెట్ ఎండింగ్

గాంధీజీని స్మరించడం అంటే కేవలం జయంతి జరుపుకోవడం కాదు..
ఆయన చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను ఆచరించడమే నిజమైన నివాళి.
పద్మనాభం కేజీబీవీ విద్యార్థినుల హృదయాల్లో గాంధీజీ ఆశయాల వెలుగు చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షిద్దాం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *