Saturday, 15 August 2026
  • Home  
  • సంస్కృతి.. సంప్రదాయాలు… విలువలు
- మహబూబ్ నగర్

సంస్కృతి.. సంప్రదాయాలు… విలువలు

*భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు,* భారతీయ సంస్కృతి – విశ్వానికి వెలుగు భరతభూమి పుణ్యభూమి, వేదమంత్రాల గానభూమి, ధర్మమే జీవన మార్గమై, త్యాగమే మనకు ఆదర్శమై! తల్లిని దేవతగా కొలిచే సంస్కృతి, తండ్రిని గురువుగా భావించే సంప్రదాయం, అతిథిని దేవుడిగా ఆహ్వానించే మనసు, “వసుధైవ కుటుంబకం” మన మహోన్నత వాక్యం! నుదుటన బొట్టు, హృదయంలో భక్తి, పండుగలలో వెల్లివిరిసే శక్తి, ఉగాది నుంచి దీపావళి వరకు, సంప్రదాయాల సౌరభం ప్రతి ఇంటి వరకు! పసుపు, కుంకుమల పవిత్రత, మంగళహారతుల మాధుర్యత, చీర కట్టులో భారతీయత, తెలుగు పలుకులో మమకారత! యోగమిచ్చిన శాంతిమార్గం, ఆయుర్వేదమిచ్చిన ఆరోగ్య భాగ్యం, గురుకులమిచ్చిన జ్ఞానదీపం, భారత సంస్కృతే జగతికి దీపం! కాలం మారినా మారని విలువలు, తరాలు మారినా చెరగని బంధాలు, భారతీయతే మన గర్వకారణం, సంస్కృతి సంప్రదాయాలే మన ప్రాణం! ప్రపంచమంతా ఒక్క కుటుంబమని ప్రేమ సందేశం చాటిన నేల, ధర్మం, శాంతి, సహనం నేర్పిన భారతమాతకు శతకోటి వందనాలు! *డాక్టర్ ఎంఎన్ విజయకుమార్, కవి, రచయిత, సంపాదకులు పాలమూరు జిల్లా*

*భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు,*

భారతీయ సంస్కృతి – విశ్వానికి వెలుగు
భరతభూమి పుణ్యభూమి,
వేదమంత్రాల గానభూమి,
ధర్మమే జీవన మార్గమై,
త్యాగమే మనకు ఆదర్శమై!
తల్లిని దేవతగా కొలిచే సంస్కృతి,
తండ్రిని గురువుగా భావించే సంప్రదాయం,
అతిథిని దేవుడిగా ఆహ్వానించే మనసు,
“వసుధైవ కుటుంబకం” మన మహోన్నత వాక్యం!
నుదుటన బొట్టు, హృదయంలో భక్తి,
పండుగలలో వెల్లివిరిసే శక్తి,
ఉగాది నుంచి దీపావళి వరకు,
సంప్రదాయాల సౌరభం ప్రతి ఇంటి వరకు!
పసుపు, కుంకుమల పవిత్రత,
మంగళహారతుల మాధుర్యత,
చీర కట్టులో భారతీయత,
తెలుగు పలుకులో మమకారత!
యోగమిచ్చిన శాంతిమార్గం,
ఆయుర్వేదమిచ్చిన ఆరోగ్య భాగ్యం,
గురుకులమిచ్చిన జ్ఞానదీపం,
భారత సంస్కృతే జగతికి దీపం!
కాలం మారినా మారని విలువలు,
తరాలు మారినా చెరగని బంధాలు,
భారతీయతే మన గర్వకారణం,
సంస్కృతి సంప్రదాయాలే మన ప్రాణం!
ప్రపంచమంతా ఒక్క కుటుంబమని
ప్రేమ సందేశం చాటిన నేల,
ధర్మం, శాంతి, సహనం నేర్పిన
భారతమాతకు శతకోటి వందనాలు!

*డాక్టర్ ఎంఎన్ విజయకుమార్, కవి, రచయిత, సంపాదకులు పాలమూరు జిల్లా*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.