*సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వం – సింగరంపాలెంలో పింఛన్లు పంపిణీ చేసిన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు*
కాకినాడ జిల్లా గండేపల్లి అక్టోబర్ 1: జగ్గంపేట మండలం సింగరంపాలెం గ్రామంలో నవంబర్ 1న ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహన్ రావు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెండు సంవత్సరాల కూటమి పరిపాలన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నియోజకవర్గానికి 589 కోట్ల రూపాయలతో ప్రత్యేక సంచికలను ప్రజలకు అందజేసి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు.
*ఈ సందర్భంగా పోతుల మోహన్ రావు మాట్లాడుతూ:*
– కూటమి ప్రభుత్వం అంటేనే సంక్షేమం, అభివృద్ధికి నిదర్శనం. పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం ఇది.
– ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయి.
– జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ నాయకత్వంలో నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.
– గత ప్రభుత్వం 3000 రూపాయలు కూడా సరిగా ఇవ్వలేకపోతే, కూటమి ప్రభుత్వం వచ్చాక వృద్ధులకు 3000 నుండి 4000, విభిన్న ప్రతిభావంతులకు 3000 నుండి 6000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 10000 నుండి 15000 రూపాయలకు పెంచి చరిత్ర సృష్టించింది.
– 1వ తేదీ తెల్లవారుజామునే వాలంటీర్ వ్యవస్థ లేకుండా నేరుగా ఇంటికి వచ్చి గౌరవంగా పింఛన్ ఇవ్వడం, వారి బాగోగులు తెలుసుకోవడం కూటమి ప్రభుత్వానికే సాధ్యం.
– పెన్షన్లే కాదు, రోడ్లు, తాగునీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో గండేపల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతాం.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.



