శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) ఆవరణలో జూలై 30వ తేదీ గురువారం నాడు భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.బి. వాణిశ్రీ ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), స్కిల్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్, మరియు ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉపాధి నియామకాలు జరగనున్నాయి. ఈ జాబ్ మేళాకు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఈ మేళాలో మొత్తం 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని, రాతపరీక్షలు మరియు ఇంటర్వ్యూల ద్వారా సుమారు 861 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ లేదా తత్సమాన అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత, ఆసక్తి ఉన్న యువతీ యువకులు జూలై 30వ తేదీ గురువారం ఉదయం 8.30 గంటల కల్లా ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఇంటర్వ్యూ కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులు ముందుగా http://naipunyam.ap.gov.in అనే అధికారిక లింక్ ద్వారా తమ వివరాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (DSDO) లోకనాథం, కళాశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ గంగారాం తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు 7981473129, 8919889609, 7989509540, 998853335 అనే సంప్రదింపు నెంబర్లలో సంప్రదించవచ్చని వారు స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తి ఎస్వీఏ కళాశాలలో ఈనెల 30న భారీ జాబ్ మేళా-ప్రిన్సిపాల్ డాక్టర్ వాణిశ్రీ