శ్రీకాళహస్తి, మే 11 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన వర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ రమణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఆర్. కృష్ణయ్య ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ సామాజిక, విద్యా, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గ బీసీ సంక్షేమ నియామక పత్రాలను జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చేతుల మీదుగా నాయకులకు అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ సంజాకుల బాలసుబ్రహ్మణ్యం, పట్టణ అధ్యక్షుడు జైకృష్ణ, వైస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్‌తో పాటు పలువురు బీసీ సంక్షేమ నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం