Monday, 27 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ద్రౌపతి–ధర్మరాజుల అగ్నిగుండ మహోత్సవం వైభవం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ద్రౌపతి–ధర్మరాజుల అగ్నిగుండ మహోత్సవం వైభవం

శ్రీ కాళహస్తి, జులై 27, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన పవిత్ర అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ విజయవంతంగా నిర్వహించబడింది. భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య జరిగిన ఈ మహోత్సవం కనులపండువగా సాగి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టడం వల్ల ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు విశేష కృషి చేసిన కూటమి నాయకులు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు, ఆలయ సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్ శాఖ అధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, వైద్య బృందాలు, మీడియా ప్రతినిధులు, అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మహోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరి సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ, శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దివ్య అనుగ్రహం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.