Saturday, 27 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తికి చేరుకున్న సత్యసాయి అఖండ జ్యోతి
- తిరుపతి

శ్రీకాళహస్తికి చేరుకున్న సత్యసాయి అఖండ జ్యోతి

పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న అఖండ జ్యోతి శుక్రవారం సాయంత్రం ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తికి చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు మంగళవాయిద్యాలు, భజనల నడుమ అఖండ జ్యోతికి ఘనస్వాగతం పలికారు. స్థానిక బహదూర్‌పేట భజన మందిరం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర ఉప్పు వీధి, నాయుడు బిల్డింగ్స్, ముత్యాలమ్మ గుడి వీధి, నగరి వీధి, బజార్ వీధి, తేరు వీధి, నెహ్రూ వీధి తదితర ప్రధాన వీధుల గుండా భక్తి పారవశ్యంతో సాగింది. సాయి నామస్మరణ, భజన కీర్తనలు, జయజయధ్వానాలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మార్గమధ్యంలో భక్తులు అఖండ జ్యోతికి కర్పూర హారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అఖండ జ్యోతి స్థానిక శ్రీ సత్యసాయి మందిరానికి చేరుకోగా, శుక్రవారం రాత్రి భక్తుల దర్శనార్థం ప్రత్యేకంగా ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నియోజకవర్గంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.