Sunday, 31 May 2026
  • Home  
  • శాలివాహన సంఘ భవన నిర్మాణానికి స్థలం కోసం ఎమ్మెల్యేకి వినతి
- తిరుపతి

శాలివాహన సంఘ భవన నిర్మాణానికి స్థలం కోసం ఎమ్మెల్యేకి వినతి

శ్రీ కాళహస్తి, మే 30, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తిలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘ భవనం, అన్నదాన సత్రం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు శనివారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం ఈవో బి.కె. వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. గత నెల 24న శ్రీకాళహస్తిలోని పొన్నలమ్మ దేవస్థాన కళ్యాణ మండపంలో నిర్వహించిన ‘శాలివాహన శంఖారావ సభ’లో ఆమోదించిన తీర్మానాల మేరకు ఈ వినతిని అందజేసినట్లు సంఘ నాయకులు తెలిపారు. కుమ్మర సమాజ అభ్యున్నతి, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు సంఘ భవనం, అన్నదాన సత్రం అవసరమని వారు వివరించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన సంఘ ప్రతినిధులు ఎమ్మెల్యే, ఈవోలను కలిసి స్థల కేటాయింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య, రిటైర్డ్ ఎంఈవో అద్దంకి సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షుడు మోచర్ల మధు, కోశాధికారి చల్లగిరి చిట్టిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి చలగిరి ప్రసాద్, డాక్టర్ జి. రమేష్‌తో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.