ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంతో మెమొరీ చిప్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ చిప్ విభాగం ఆదాయం గత త్రైమాసికంలో ఏకంగా 49 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో కంపెనీ తన చిప్ డివిజన్‌లోని సుమారు 78 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.3.25 కోట్ల భారీ బోనస్ ప్యాకేజీని ఆఫర్ చేసింది.
ఇటీవల ఉద్యోగులు జీతాల పెంపు, బోనస్ కోసం 18 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. సెమీకండక్టర్ తయారీలో ఒక్క రోజు సమ్మె జరిగినా కోట్లలో నష్టం వస్తుంది. అందుకే సమ్మెను నివారించడానికి కంపెనీ ఉద్యోగ సంఘంతో ఒప్పందం కుదుర్చుకుని, ఈ భారీ బోనస్‌ను ప్రకటించింది.


