అనంతసాగరం: మండలంలోని గౌరవరం వద్ద ఉత్తర కాలువ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాలువ ప్రస్తుత సామర్థ్యాన్ని 750 క్యూసెక్కుల నుంచి 1,550 క్యూసెక్కులకు పెంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భారీ యంత్రాలను వినియోగిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే పనులను పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కాలువ సామర్థ్యం పెంపుతో సాగునీటి ప్రవాహం మెరుగుపడనుంది. ముఖ్యంగా చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగుతాయని అధికారులు పేర్కొన్నారు. పనులు పూర్తయితే ఆయకట్టు పరిధిలోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

శరవేగంగా ఉత్తర కాలువ పనులు.. చివరి ఆయకట్టుకు సాగునీటి భరోసా