ఖమ్మం నగరము లో ఖానాపూరం లో ని ప్రసిద్ధి చెందిన
స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు శంకు, చక్ర నామాలను ఏర్పాటు చేసేందుకు శ్యామల శ్రీనివాస్ రెడ్డి దంపతుల సహకారంతో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శి బెల్లి కొండాలరావు, కోశాధికారి పల్లపు సత్యం, గౌరవ అధ్యక్షులు బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారులు పల్లెబోయిన చంద్రయ్యతో పాటు దండా జ్యోతి రెడ్డి, మేకల వీరన్న, బందు వెంకటేశ్వర్లు, గుగులోతు మణికంఠ, అల్లిక వీరబాబు, రాచకొండ వెంకటేశ్వర్లు, అయితనబోయిన వెంకటేశ్వర్లు, పురం తిరుపతయ్య, ఆలేటి రామారావు, మల్సూర్ నాయక్, అంకం రమేష్, దాచేపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



