Friday, 11 July 2025
  • Home  
  • వైద్య ఆరోగ్య రంగం లో డాక్టర్ సుజాత రావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలి” Dr Mvr
- Featured - ఆంధ్రప్రదేశ్

వైద్య ఆరోగ్య రంగం లో డాక్టర్ సుజాత రావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలి” Dr Mvr

ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రథమ మహాసభ ఈరోజు డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగింది .ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ వైద్య కమిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యా రంగాన్ని పూర్తిగా వ్యాపార మయం చేసింది..అలాగే ప్రజారోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది అని అన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2012 ప్రకారం పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలందించే చిన్న, మధ్య తరహా ప్రైవేట్ ఆస్పత్రులకు రక్షణ కల్పించాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం వైద్య ఆరోగ్య రంగంలో డాక్టర్ సుజాత రావు కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని మరియు అలాగే ఆ సిఫార్సులను కొన్నింటిని సవరించి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సదుపాయాలు మెరుగ్గా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు . రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సుజాత రావు గారు చేసిన సిఫార్సులు తూచా తప్పకుండా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెంచాలని, డాక్టర్లు మరియు సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలని, వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిపించాలని మరియు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం అన్ని రాజకీయ పార్టీల,ప్రజా సంఘాల సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో గత రెండేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలను సవివరంగా మహాసభకు అందించారు.వైద్య సేవల కార్పొరేటీకరణను ప్రజారోగ్య వేదిక వ్యతిరేకిస్తుందన్నారు. కోశాధికారి జి.వేణుగోపాలరావు ఆర్థిక నివేదికను మరియు 16 డిమాండ్లతో కూడిన నివేదికను ప్రవేశపెట్టారు. తదుపరి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. Also Read: టీవీ , సెల్ ఫోన్ ల వాడకం – తెచ్చి పెడుతుంది ఊబకాయం అధ్యక్షులు–డాక్టర్ రాజేశ్వర రావు ఉపాధ్యక్షులు– డాక్టర్ ఎస్కే కాలేషాభాష –ఎన్.నవకోటేశ్వరరావు — ఎస్కే గౌస్ బాష ప్రధాన కార్యదర్శి—- జి.శ్రీనివాసరావు కార్యదర్శులుగా– జి కృష్ణారెడ్డి ఎస్ కే జిలాని భాష ఎన్ . సతీష్ కుమార్ కోశాధికారిగా—– జి వేణుగోపాలరావు అలాగే 20మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైనారు.

ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రథమ మహాసభ

ఈరోజు డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగింది .ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ వైద్య కమిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యా రంగాన్ని పూర్తిగా వ్యాపార మయం చేసింది..అలాగే ప్రజారోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది అని అన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2012 ప్రకారం పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలందించే చిన్న, మధ్య తరహా ప్రైవేట్ ఆస్పత్రులకు రక్షణ కల్పించాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం వైద్య ఆరోగ్య రంగంలో డాక్టర్ సుజాత రావు కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని మరియు అలాగే ఆ సిఫార్సులను కొన్నింటిని సవరించి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సదుపాయాలు మెరుగ్గా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు . రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సుజాత రావు గారు చేసిన సిఫార్సులు తూచా తప్పకుండా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెంచాలని, డాక్టర్లు మరియు సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలని, వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిపించాలని మరియు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం అన్ని రాజకీయ పార్టీల,ప్రజా సంఘాల సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో గత రెండేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలను సవివరంగా మహాసభకు అందించారు.వైద్య సేవల కార్పొరేటీకరణను ప్రజారోగ్య వేదిక వ్యతిరేకిస్తుందన్నారు. కోశాధికారి జి.వేణుగోపాలరావు ఆర్థిక నివేదికను మరియు 16 డిమాండ్లతో కూడిన నివేదికను ప్రవేశపెట్టారు. తదుపరి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.

Also Read: టీవీ , సెల్ ఫోన్ ల వాడకం – తెచ్చి పెడుతుంది ఊబకాయం
అధ్యక్షులు–డాక్టర్ రాజేశ్వర రావు ఉపాధ్యక్షులు– డాక్టర్ ఎస్కే కాలేషాభాష
–ఎన్.నవకోటేశ్వరరావు
— ఎస్కే గౌస్ బాష
ప్రధాన కార్యదర్శి—- జి.శ్రీనివాసరావు కార్యదర్శులుగా– జి కృష్ణారెడ్డి
ఎస్ కే జిలాని భాష
ఎన్ . సతీష్ కుమార్ కోశాధికారిగా—– జి వేణుగోపాలరావు అలాగే 20మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైనారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.