మంగళగిరిలోని రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌లో జరిగిన ‘ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థల వ్యూహాత్మక సదస్సు’ మరియు ‘ఏపీ మెడ్‌టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే’ కార్యక్రమాల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దేశంలోనే తొలిసారిగా మెడ్‌టెక్ ఛాలెంజ్ విధానంలో వైద్యసేవల్లో కృత్రిమ మేధ (AI) వినియోగంతో ఆంధ్రప్రదేశ్ ‘లైట్‌హౌస్ స్టేట్’గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఏఐ సమర్థ వినియోగం వల్ల తక్కువ ఖర్చుతో కూడిన, నాణ్యమైన వైద్యసేవలు రోగులకు అందుతాయని, వ్యాధుల భారాన్ని తగ్గించడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన 18 అంకుర సంస్థలకు (Startups) నగదు ప్రోత్సాహకాలను అందించారు


