*వెల్వడం గ్రామ వై.ఎస్.ఆర్.సి.పి సర్పంచ్ అభ్యర్థి వేల్పూరి తిరుమల ఘనవిజయం*
పున్నమి
/ రిపోర్టర్/ మైలవరం/ ఎన్టీఆర్ జిల్లా/ నవంబర్ 26*
మైలవరం ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో14 వార్డులకి13 వార్డులు కైవసం వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి వేల్పూరి తిరుమల మరియు వార్డు మెంబర్స్ విజయం సాధించారు.
గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామ ప్రజలందరినీ కలుపుకొని వెల్వడం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని వెల్లడించారు.
వెల్వడం గ్రామ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించిన వేల్పూరి తిరుమలకు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

