వరదయ్యపాలెం మండలంలోని ఎంపీపీఎస్ వెంగారెడ్డి కండ్రిగ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు విద్యా సామాగ్రి, క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు విద్యాభ్యాసంలో మరింత ముందుకు సాగాలని, అందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో
👉ఉపాధ్యాయులు ఆనంద్ స్నేహితుడైన ఆకెళ్ళ చక్రవర్తి
(డోనర్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని అతిథులు సూచించారు.
👉ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లు (MEO) శ్రీమతి సరస్వతి, శ్రీ గున్నయ్య, గ్రామస్థులు గోపీ రెడ్డి, ప్రభయ్య, ఉపాధ్యాయులు ఆనంద్, శివతో పాటు విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం డోనర్ ఆకెళ్ళ చక్రవర్తికి పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు


