డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో వీఆర్ఏలు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతుగా అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసి, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి పోరాటానికి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎంపీపీ ఇళ్ల శేషారావు, రాష్ట్ర, జిల్లా నాయకులు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.



