Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

విరాట్ నగర్ లో ప్రచార కార్యక్రమం ముమ్మరం చేసిన NDA కూటమి సర్పంచ్ అభ్యర్థి షంషూర్ షేక్ బాలేరంతు!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విరాట్ నగర్ లో ప్రచార కార్యక్రమం ముమ్మరం చేసిన NDA కూటమి సర్పంచ్ అభ్యర్థి షంషూర్ షేక్ బాలేరంతు!!!

పామూరు, నవంబర్ 25 @3:22 am (పున్నమి తెలుగు దినపత్రిక ).. టీడీపి పార్టీ బలపరచి, కనిగిరి యం. యల్. ఏ. డాక్టర్ ఉగ్రనరసింహరెడ్డి ఆదేశాలతో పామూరు సర్పంచ్ గా పోటీచేయుచున్న షేక్. శంషుర్ విద్యావంతుడని, దానధర్మాలు చేయడంలో రంతిదేవుడంతటి వాడని, ఇలాంటి మంచి మనసున్న శంషుర్ ని పామూరు పంచాయతీ పీఠం ఎక్కించి తీరుతామని పట్టణ మేజర్ నాయకులు మరియు పామూరు గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.. ప్రచార కార్యక్రమ చివరిరోజు స్థానిక విరాట్ నగర్ లో కార్యక్రమం ప్రారంభించిన NDA కూటమి షేక్. షంషూర్ మరియు పట్టణ టీడీపీ నాయకులు.. ముందుగా విరాట్ నగర్ లో వేంచేసిఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రాహ్మంద్ర స్వామి ఆలయంలో పూజలందుకొని ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు.. ఈ మహత్తర చివరి ప్రచార పర్వంలో సర్పంచ్ అభ్యర్థి శంషుర్ తో సహా, విరాట్ నగర్ ఆలయ ప్రధాన సంచాలకులు నొస్సమ్ నాగేంద్రాచారి,,మాజీ సర్పంచ్ డీవీ. మనోహర్, అలాగే ఇంకొక మాజీ సర్పంచ్ కావిటి సుబ్బయ్య కనిగిరి సీనియర్ లాయర్ ఫయాజ్,,పులి నాయబా, నబీసా గారి జిలాని పాల్గొని ప్రచార కార్యక్రమం జయప్రదం చేశారు..

విరాట్ నగర్ లో ప్రచార కార్యక్రమం ముమ్మరం చేసిన NDA కూటమి సర్పంచ్ అభ్యర్థి షంషూర్ షేక్ బాలేరంతు!!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *