లోకేశ్వరం మండలం ధర్మోర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్ మామిడి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో యూనిఫాంలను పంపిణీ చేశారు. సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు విద్యార్థులకు యూనిఫాంలు అందజేసి వారిని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ మంద గణేష్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం.. ధర్మోరలో యూనిఫాంల పంపిణీ
లోకేశ్వరం మండలం ధర్మోర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్ మామిడి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో యూనిఫాంలను పంపిణీ చేశారు. సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు విద్యార్థులకు యూనిఫాంలు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మంద గణేష్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

