శ్రీ కాళహస్తి, జులై 28, (పున్నమి న్యూస్): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో వచ్చిన విప్లవాత్మక సంస్కరణల వల్ల ఈ విద్యాసంవత్సరంలో లక్షకు పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ బడులలో చేరారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ….16,347 పోస్టులతో చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా పూర్తయిందని, ఉద్యోగాలు సాధించిన వారి వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని స్పష్టం చేశారు. విద్యాశాఖ ఇప్పటికే ఆధారాలతో స్పష్టత ఇచ్చినప్పటికీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిజాయితీ ఉంటే జాతీయ మీడియా సమక్షంలో నారా లోకేష్‌తో చర్చకు రావాలని, లేదా తాడేపల్లి నివాసంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే తానే నేరుగా వచ్చి చర్చించడానికి సిద్ధమని సవాల్ విసిరారు. గతంలో ‘నాడు-నేడు’ పేరిట వైసీపీ నాయకులు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన, నిరాధార వ్యాఖ్యలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

లోకేష్ సంస్కరణలతో ప్రభుత్వ బడుల్లో చేరికలు పెరిగాయి-ఎమ్మెల్యే బొజ్జల