శ్రీ కాళహస్తి, జులై 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలకలు, పుస్తకాలు మరియు విద్యా సామాగ్రిని శుక్రవారం ఘనంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రమీల మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు తమ క్లబ్ తరఫున ఎల్లప్పుడూ నిరంతరం కృషి చేస్తామని, తమ వంతు సాయాన్ని అందిస్తూనే ఉంటామని తెలిపారు. అనంతరం క్లబ్ సెక్రటరీ డాక్టర్ మ్యాగీ క్లారా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటుగా వ్యక్తిగత ఆరోగ్య సూత్రాలను కూడా విధిగా పాటించాలని, సకాలంలో పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రప్ప ప్రత్యేక హర్షం వ్యక్తం చేస్తూ.. తమ పాఠశాల విద్యార్థుల కొరకు రోటరీ క్లబ్ ముందుకు వచ్చి ఉచితంగా సామాగ్రిని అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ సేవా కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రముఖ సభ్యులు ఉమా, డాక్టర్ వెంకట్రామన్, చెంగారెడ్డి, తరుణ్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ