రాజన్న సిరిసిల్ల ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండలంలో రైతులకు యూరియా కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. యూరియా యాప్‌లో సరిపడా నిల్వలు కనిపించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలోని ఫర్టిలైజర్, మందుల దుకాణాలతో పాటు కో-ఆపరేటివ్ సొసైటీలు, సహకార సంఘాల ద్వారా కూడా యూరియా అందించాలని కోరారు. మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏద్దండీ నర్సింహారెడ్డి, బత్తుల అంజయ్య, నల్ల నర్సయ్య, శీలం స్వామి తదితరులు పాల్గొన్నారు.


