Saturday, 18 July 2026
  • Home  
  • రేణిగుంట డీఎస్పీ ఆధ్వర్యంలో చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ మీటింగ్ నిర్వహణ
- తిరుపతి

రేణిగుంట డీఎస్పీ ఆధ్వర్యంలో చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ మీటింగ్ నిర్వహణ

రేణిగుంట డివిజన్ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు (17.07.2026) చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ మీటింగ్నిర్వహించబడింది. ఈ సమావేశానికి కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారితో పాటు పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మరియు చిట్వేల్ పోలీస్ స్టేషన్ల సబ్-ఇన్‌స్పెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ గారు పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, బాధితులకు మర్యాదపూర్వకంగా సేవలు అందిస్తూ సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ, పోలీస్ సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించి స్థానిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న Trouble Mongers ను గుర్తించి, అవసరమైన Bind Over చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో చోటుచేసుకునే ముఖ్యమైన పరిణామాలు, వివాదాలు, రాజకీయ పరిస్థితులు మరియు ఇతర సున్నితమైన అంశాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు నివేదిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ చట్టవ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఎస్పీ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రేణిగుంట డివిజన్ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు (17.07.2026) చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ మీటింగ్నిర్వహించబడింది.
ఈ సమావేశానికి కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారితో పాటు పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మరియు చిట్వేల్ పోలీస్ స్టేషన్ల సబ్-ఇన్‌స్పెక్టర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ గారు పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, బాధితులకు మర్యాదపూర్వకంగా సేవలు అందిస్తూ సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ, పోలీస్ సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించి స్థానిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న Trouble Mongers ను గుర్తించి, అవసరమైన Bind Over చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా గ్రామాల్లో చోటుచేసుకునే ముఖ్యమైన పరిణామాలు, వివాదాలు, రాజకీయ పరిస్థితులు మరియు ఇతర సున్నితమైన అంశాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు నివేదిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ చట్టవ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఎస్పీ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.