అనపర్తి, ఆగస్టు 9 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి పట్టణంలో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 11 సీసీ రోడ్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనపర్తి టౌన్‌లోని మహాలక్ష్మిపేట, కుమ్మరి వీధి, బాపనమ్మ గుడి వీధి, అయ్యప్ప స్వామి టెంపుల్ ఏరియా, ఆంజనేయ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఈ రోడ్లను నిర్మించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారుల అభివృద్ధితో ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



