Wednesday, 27 May 2026
  • Home  
  • రాష్ట్రంలో ముదిరిన వడగాల్పులు.| 29 మంది మృతి
- ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ముదిరిన వడగాల్పులు.| 29 మంది మృతి

అత్యధిక ఉష్ణోగ్రతలు:- గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7°C ఉష్ణోగ్రత నమోదైంది. గురజాలలో 47.6°C, కంచికచర్ల మరియు ఇంకొల్లులో 47.3°C నమోదయ్యాయి. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44°C దాటింది. వడగాల్పుల హెచ్చరిక:- బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం 81 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 203 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నాయి. ప్రాణనష్టం: వడదెబ్బ కారణంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 మంది మరణించారు. మృతులలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాలకు చెందిన పలువురు వృద్ధులు, పౌరులు ఉన్నారు. వర్ష సూచన: – ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండడం వల్ల బుధవారం చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉంది

అత్యధిక ఉష్ణోగ్రతలు:- గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7°C ఉష్ణోగ్రత నమోదైంది. గురజాలలో 47.6°C, కంచికచర్ల మరియు ఇంకొల్లులో 47.3°C నమోదయ్యాయి. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44°C దాటింది.

వడగాల్పుల హెచ్చరిక:- బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం 81 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 203 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నాయి.

ప్రాణనష్టం: వడదెబ్బ కారణంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 మంది మరణించారు. మృతులలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాలకు చెందిన పలువురు వృద్ధులు, పౌరులు ఉన్నారు.

వర్ష సూచన: – ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండడం వల్ల బుధవారం చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.