Friday, 2 October 2026
  • Home  
  • *రావులపాలెం పంచాయతీకి స్వచ్చాంద్రా అవార్డు* *రాష్ట్రంలో 12 పంచాయతీలు ఎంపిక* *రేపు అందజేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*రావులపాలెం పంచాయతీకి స్వచ్చాంద్రా అవార్డు* *రాష్ట్రంలో 12 పంచాయతీలు ఎంపిక* *రేపు అందజేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు*

డాక్టర్ బి.అర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా,రావులపాలెం,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): పారిశుధ్య నిర్వహణలో అగ్రగామిగా ఉన్న కోనసీమ ముఖద్వారం రావులపాలెం గ్రామపంచాయతీకి స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంద్ర అవార్డు దక్కింది. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఈ అవార్డును పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్ దుర్గాప్రసాద్ అందుకోనున్నారు.సుమారు 35 వేల జనాభాతో విస్తరించి ఉన్న ఈ గ్రామం పారిశుద్ధ్య నిర్వహణలో భేష్ అనిపించుకుంటుంది.ఇంటింటికి చెత్త సేకరణ,అలాగే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహణ తదితర విషయాల్లో ఈ పంచాయతీకి అవార్డు దక్కింది. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలి ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ఈ రావులపాలెం పంచాయతీ అందుకున్న సంగతి తెలిసిందే. గ్రామంలో వార్డులన్నిటిని పది విభాగాలుగా విభజించి సక్రమంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టడం అలాగే ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు,ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తడిపొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 12 గ్రామపంచాయతీలు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. అందులో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో గల ఐదు జిల్లాల పరిధిలో కేవలం రెండు పంచాయతీలకు ఈ అవార్డు దక్కింది.రావులపాలెంతో పాటు కాకినాడ జిల్లా గండేపల్లి గ్రామ పంచాయతీ ఈ అవార్డుకు ఎంపికైంది.

డాక్టర్ బి.అర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా,రావులపాలెం,అక్టోబర్ 1(పున్నమి న్యూస్):
పారిశుధ్య నిర్వహణలో అగ్రగామిగా ఉన్న కోనసీమ ముఖద్వారం రావులపాలెం గ్రామపంచాయతీకి స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంద్ర అవార్డు దక్కింది. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఈ అవార్డును పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్ దుర్గాప్రసాద్ అందుకోనున్నారు.సుమారు 35 వేల జనాభాతో విస్తరించి ఉన్న ఈ గ్రామం పారిశుద్ధ్య నిర్వహణలో భేష్ అనిపించుకుంటుంది.ఇంటింటికి చెత్త సేకరణ,అలాగే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహణ తదితర విషయాల్లో ఈ పంచాయతీకి అవార్డు దక్కింది. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలి ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ఈ రావులపాలెం పంచాయతీ అందుకున్న సంగతి తెలిసిందే. గ్రామంలో వార్డులన్నిటిని పది విభాగాలుగా విభజించి సక్రమంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టడం అలాగే ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు,ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తడిపొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 12 గ్రామపంచాయతీలు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. అందులో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో గల ఐదు జిల్లాల పరిధిలో కేవలం రెండు పంచాయతీలకు ఈ అవార్డు దక్కింది.రావులపాలెంతో పాటు కాకినాడ జిల్లా గండేపల్లి గ్రామ పంచాయతీ ఈ అవార్డుకు ఎంపికైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.