దేశ సరిహద్దుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టును వేగవంతం చేసింది. డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కొత్త భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
భుజ్‌లో రెండు కొత్త సరిహద్దు ఔట్‌పోస్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భవిష్యత్తులో ఎవరూ భారత సరిహద్దులను ఉల్లంఘించలేని విధంగా పటిష్ఠమైన భద్రతా వలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


