ఖమ్మం, జూలై
రఘునాథపాలెం మండలం సర్వే నెం.218 భూ పట్టాదారులకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులతో కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను బీఆర్‌ఎస్ మాజీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.



