ముస్తాబాద్/ ఏప్రిల్ 22/ పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, సేవాలాల్ తండా, మొఱ్ఱపూర్, గన్నెవని పల్లె గ్రామాల్లో ఐకెపి సెంటర్లను ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా బీమా, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలతో రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు వడ్లను కొనుగోలు చేస్తుందని,. రైతులు పంట మార్పిడి వైపు దృష్టి సారించి సన్నవడ్లు, ఆయిల్ పామ్, కూరగాయల సాగు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు మట్ట వెంకటేశ్వర్ రెడ్డి , పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ రేసు రఘు . భూక్యరాజు నాయక్. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు మండల ఉప సర్పంచుల పోరం అధ్యక్షులు తాళ్ల విజయ రెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

