శ్రీ కాళహస్తి, జులై 14, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె.వి. కృష్ణారెడ్డిని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు దండి నరేంద్ర ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని పలు ప్రజా సమస్యలు, నగరాభివృద్ధి, మున్సిపల్ సేవలపై కమిషనర్‌తో నాయకులు నిర్మాణాత్మక చర్చలు జరిపారు. మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత, వీధి దీపాల పునరుద్ధరణ, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిసరాల పారిశుధ్యం, అక్రమ బ్యానర్ల తొలగింపు, ఎస్‌ఐఆర్ (SIR) పురోగతి, పన్నుల నిర్వహణ, మున్సిపాలిటీ ఆదాయ వనరుల పెంపు తదితర కీలక అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించడంలో పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నవీన్, చంద్ర, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేతలు