ముధోల్, ఆగస్టు 6(తెలంగాణ పున్నమి ప్రతినిధి ): ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి 72వ జన్మదిన వేడుకలను గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన,ఓడిన నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడని ఆయన్ను కొనియాడారు.నేడు అధికారంలో లేకున్నా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సంక్షేమం,అభివృద్ధికి పాటుపడుతున్నారని వెల్లడించారు.జననేత నియోజకవర్గ ముద్దుబిడ్డ విఠల్ రెడ్డికి ఎల్లవేళలా ప్రజల ఆశీర్వాదం ఉండి రానున్న రోజుల్లో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్, సెక్రటరీ బాసీర్,పి ఎ సి ఎస్ చెర్మన్ సాయిరాం,మండల అధ్యక్షులు కిష్టయ్య,మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్,పి ఎ సి ఎస్ చెర్మన్ సురేందర్ రెడ్డి,సర్పంచ్ లు షబానా ఎజాజ్ ఉద్దీన్ సర్వేష్,జై శ్రీ కాంత్ రావు, రుచిత దిగంబర్,మాజీ పి ఎస్ సి ఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ లు మాక్ధూమ్, మాజీ సర్పంచ్ లు రామ్ రెడ్డి, సాయినాథ్,గౌతమ్, నాయకులు నాగేష్,సంజు,విట్టల్ కాంబ్లె,వంశీ,విట్టల్,విశ్వంబర్,సాయినాథ్, బాబు,ఆయా గ్రామాల మాజీ సర్పంచ్ లు , ఎంపీటీసీ లు, నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



