శ్రీ కాళహస్తి, జులై 15, (పున్నమి న్యూస్): ప్రముఖ ప్రజానాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో పరమపదించడం అత్యంత బాధాకరమని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దండి నరేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాపు సమాజానికి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ చేసిన నిస్వార్థ పోరాటం, సామాజిక సేవ, ఆత్మగౌరవ ఉద్యమం చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఆయన అందించిన సేవలు, ఆశయాలు రాబోయే తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయని వెల్లడించారు. ముద్రగడ పవిత్ర ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు గిరి, క్రాంతి, బంధుమిత్రులు, అభిమానులకు దండి నరేంద్ర తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు-దండి నరేంద్ర సంతాపం