సుజాతనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సమ సమాజం ద్వారానే నిజమైన స్వాతంత్రం వేల్పుల భాస్కర్
సుజాత నగర్ పున్నమి ప్రతి నిధి చల్లగుండ్ల నరేష్ ఆగష్టు 15 : మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అంబేద్కర్‌వాది వేల్పుల భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సుజాతనగర్ ఎస్సై కళ్యాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాల్గొన్న వారందరూ జెండాకు గౌరవ వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎస్సై కళ్యాణి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సమానత్వంతో జీవించాలని, దేశభక్తిని మరియు సోదరభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు చేసి తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.
దేశం మరింత అభివృద్ధి సాధించడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, విద్యపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
కార్యక్రమ అధ్యక్షులు వేల్పుల భాస్కర్ మాట్లాడుతూ రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించినప్పుడే స్వాతంత్ర్యానికి పూర్తి అర్థం చేకూరుతుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన రాజ్యాంగ మార్గంలో కుల వివక్ష, అంటరానితనం, అసమానతలను నిర్మూలించి సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “సమ సమాజం ద్వారానే నిజమైన స్వాతంత్రం” అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్కూల్ విద్యార్థుల మహనీయుల వేషధారణ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఏఎస్ఐ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు, 21వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, 22వ డివిజన్ కార్పొరేటర్ లింగం పుష్పావతి.
ప్రత్యేక ఆహ్వానితులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపూడి రాజశేఖర్, బత్తుల వీరయ్య, లింగం పిచ్చిరెడ్డి, లోశెట్టి నాగార్జున ,సాంబ ,బీఆర్ఎస్ నాయకులు చింతలపూడి జగన్, అలవాల కార్తీక్, సీపీఎం నాయకులు వీర్ల రమేష్, గండమాల భాస్కర్, చింతలపూడి సాయి,సీపీఐ నాయకులు వీర్ల మల్లేష్, కత్తి వెంకన్న .
ఆహ్వానితులుగా మేరా మహేష్ సయ్యద్ మీరాబి, ఎస్.కె. అజ్జు, ఉబ్బనపల్లి శ్రీను, కత్తి యోగేష్, రైస్ కోటి.
కార్యక్రమ నిర్వాహకులు కేసుపాక వెంకటేశ్వర్లు, వేల్పుల రాజు, దంసలపురి గాంధీ, ఈట వెంకట సాయి, గుర్రం పవన్, కత్తి మనోజ్, తేలూరి ఉదయ్, కుక్కముడి ప్రసాద్, కేసుపాక శ్రీను, కుక్కముడి జగదీష్, సాత్విక్, రాకేష్, మరియు కేసుపాక పుల్లయ్య, కాకటి సుందరం, గుర్రం బక్కయ్య, ఎస్.కె. షకీలా, వేల్పుల కృష్ణవేణి, తేలూరి రాధ, దంసలపురి ఉమా, కేసుపాక రాజ్యలక్ష్మి, కుక్కముడి దుర్గా, మంద మెరిసి, వేల్పుల రేణుక కవులూరి అరుణ ,ఉబ్బనపల్లి నాగేశ్వరి, హన్సిక ,కేసు పాక సీతారాములు విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, రాజ్యాంగ విలువలను కాపాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావంతో ముందుకు సాగాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రతిజ్ఞ చేశారు



