*మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి*
*డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి – మీ భవిష్యత్తుకు ‘ఎస్’ చెప్పండి.*
*కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహణ.*
– *కుప్పం ఏఎస్పీ బొడ్డు హేమంత్,
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతలో అవగాహన కల్పించేందుకు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు కుప్పం
ఏఎస్పీ బొడ్డు హేమంత్, “యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం” నిర్వహించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి వల్ల కలిగే సామాజిక మరియు వ్యక్తిగత నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ బొడ్డు హేమంత్ మాట్లాడుతూ…మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు మరియు కుటుంబ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తాము మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు, తమ స్నేహితులు మరియు ఇతర యువతను కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యపరచాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం మరియు వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఏఎస్పీ బొడ్డు హేమంత్ తెలిపారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు లేదా 112కు లేదా ఎస్ బి ఇన్స్పెక్టర్ – 9490617896 లేదా చిత్తూరు జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005 కు సమాచారం అందించాలని సూచించారు.*
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, వైస్ ప్రిన్సిపాల్ నారాయణమూర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ అడ్వైజర్ లయన్ ఏ. మహేష్, కళాశాల అధ్యాపకులు, పోలీసు శాఖ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


