కావలి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో కూటమి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే డి.వి. కృష్ణారెడ్డి 20 మంది మహిళలకు రూ.22 లక్షల వడ్డీ లేని సబ్సిడీ రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మగ్గం శిక్షణను ప్రారంభించిన ఆయన, రుణంతో ఒక మహిళ కొనుగోలు చేసిన ఆటోను స్వయంగా నడిపి ఉత్సాహపరిచారు.
అనంతరం అల్లూరు మండలంలో తాగునీటి సమస్యపై అధికారులతో సమావేశమై చర్చించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి ఉంటే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచిస్తూ, ఉద్దీపగుంట, ఎర్రపుగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


