‘మరియు నేను’ నా దేశ రక్షణకు రక్తపు బొట్టు నౌతా
‘మరియు నేను’నా దేశం కోసం నా దేహాన్నిస్తా
‘మరియు నేను’ నా జాతి కోసం మరో అల్లూరి నౌతా
‘మరియు నేను’ అవిశ్రాంత పోరాటాలకు ఆయువునవుతా
‘మరియు నేను’ అపజయానికి ఆటను, విజయానికి బాటనౌతా
‘మరియు నేను’ కాలే కడుపుల కన్నీరుకి పన్నీరు నౌతా
‘మరియు నేను’ అనంత వాయువుల్లో కలిసిన ప్రాణాలకు పునర్జీవుడ్ని అవుతా
‘మరియు నేను’ ఆయుధం లేని సైనికుడికి వజ్రాయుధాన్ని అవుతా
‘మరియు నేను’ అడవి తల్లికి, నేల తల్లికి, కన్నతల్లికి వెలుగును అవుతా
‘మరియు నేను’రవి చూడని బ్రతుకులకు పున్నమి నౌతా
ఒకవేళ…!
ఈ అవిశ్రాంత పోరాటంలో ప్రాణం పోతే!
ఈ దేహాన్ని ఇచ్చిన ఆ దాన తల్లిని మొరపెట్టుకుంటా
ఈ దేహం ధరణిలో ఎరువు అవ్వాలని,
నా ప్రాణం అనంత వాయువుల్లో కలవాలని,
ఆ వాయువు పీల్చిన ఏదో ఒక ప్రాణి “మరియు నేను ” అయ్యి ముందుకు రావాలని.,,!
—కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )


