Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 26 (పున్నమి ప్రతినిధి) మనుబోలు వైపు నుంచి గూడూరుకు వెళ్తున్న కేటీఎం ద్విచక్ర వాహనం, గూడూరు నుంచి బద్వేలు వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.
  • ఈ ప్రమాదం మనుబోలు మండల పరిధిలోని బద్వేలు క్రాస్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది.
  • ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సుమారు 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 26 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు వైపు నుంచి గూడూరుకు వెళ్తున్న కేటీఎం ద్విచక్ర వాహనం, గూడూరు నుంచి బద్వేలు వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం మనుబోలు మండల పరిధిలోని బద్వేలు క్రాస్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న సుమారు 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బైక్‌పై ప్రయాణిస్తున్న ఈశ్వర్, మహేష్ అనే యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *