Thursday, 6 August 2026
  • Home  
  • మధ్యవర్తిత్వం రాజీమార్గం పై అవగాహన కార్యక్రమం,పారా లీగల్ వాలంటీర్ అట్లూరి జ్యోతి
- పల్నాడు

మధ్యవర్తిత్వం రాజీమార్గం పై అవగాహన కార్యక్రమం,పారా లీగల్ వాలంటీర్ అట్లూరి జ్యోతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి వి.విజయకుమార్ రెడ్డి సూచనలతో బుధవారం పల్నాడు జిల్లా అమరావతిలో మధ్యవర్తిత్వం రాజీమార్గం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మధ్యవర్తిత్వం (Mediation) ప్రాముఖ్యతను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని మాట్లాడుతూ, సివిల్ తగాదాలు, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులు, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మనోవర్తి కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రెవెన్యూ వివాదాలు, ప్రీ-లిటిగేషన్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.సత్తెనపల్లి కోర్టు పరిధిలోని కక్షిదారులు కోర్టు పనివేళల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సత్తెనపల్లి బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డ్ నందు గల కోర్టు నందు గల కోర్టు సిబ్బందిని సంప్రదించి, మధ్యవర్తిత్వ సేవలను వినియోగించుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ అట్లూరి జ్యోతి పాల్గొని మధ్యవర్తిత్వ విధానం, ఉచిత న్యాయ సేవలు, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి వి.విజయకుమార్ రెడ్డి సూచనలతో బుధవారం పల్నాడు జిల్లా అమరావతిలో మధ్యవర్తిత్వం రాజీమార్గం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మధ్యవర్తిత్వం (Mediation) ప్రాముఖ్యతను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
అనంతరం పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని మాట్లాడుతూ, సివిల్ తగాదాలు, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులు, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మనోవర్తి కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రెవెన్యూ వివాదాలు, ప్రీ-లిటిగేషన్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.సత్తెనపల్లి కోర్టు పరిధిలోని కక్షిదారులు కోర్టు పనివేళల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సత్తెనపల్లి బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డ్ నందు గల కోర్టు నందు గల కోర్టు సిబ్బందిని సంప్రదించి, మధ్యవర్తిత్వ సేవలను వినియోగించుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ అట్లూరి జ్యోతి పాల్గొని మధ్యవర్తిత్వ విధానం, ఉచిత న్యాయ సేవలు, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.