Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

మత్తుకు దూరం – మహోన్నత జీవనసారం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మత్తుకు దూరం – మహోన్నత జీవనసారం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • యువతను శారీరకంగా దృఢంగా, మానసికంగా శక్తివంతంగా మరియు వ్యసనాలకు దూరంగా ఉంచి దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసే లక్ష్యం తో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 2వ తేదీన (2026) "నషా ముక్త్ యువ ఫర్ విక్షిత్ భారత్ సంకల్ప్ అభియాన్" పేరుతో 100…
  • మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడం ద్వారా 2047సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ యువత ఉద్యమం ఇది.
  • ఇందులో భాగంగా 100 వారాల పాటు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో క్రీడలు, యోగా, ధ్యానం, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

యువతను శారీరకంగా దృఢంగా, మానసికంగా శక్తివంతంగా మరియు వ్యసనాలకు దూరంగా ఉంచి దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసే లక్ష్యం తో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 2వ తేదీన (2026) “నషా ముక్త్ యువ ఫర్ విక్షిత్ భారత్ సంకల్ప్ అభియాన్” పేరుతో 100 వారాల పాటు సాగే ఒక దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడం ద్వారా 2047సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ యువత ఉద్యమం ఇది. ఇందులో భాగంగా 100 వారాల పాటు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో క్రీడలు, యోగా, ధ్యానం, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మత్తుకు దూరంగా ఉంటే మహోన్నత జీవనం మన సొత్తు అనే భావనతో ఈ కవిత
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
మత్తు పానీయాల్లో మునిగి
ఆనంద భ్రమల భూతాన్ని చేరి
క్షణికమైన మత్తులో చిక్కుకుపోయి
ఆరోగ్య దేహాన్ని నాశనం చేసుకోకు
నీ భావి భవిష్యత్ను బలి చేసుకోకు

మత్తు పదార్థాలకు బానిస కాకు
కన్నవారి కంటిలో కన్నీరు చూడకు
నీ శక్తి యుక్తిని మాయలో పడనీయకు
చెడు వ్యసనాల సంకెళ్లను తెగతెంచగ
ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించు

మత్తు అనేది ఒక చీకటి మార్గం
దూరం చేసుకుంటావా? నీ జీవన స్వర్గం
ఆరోగ్యం ఆయుష్షు పెంచగ చేయి యాగం
విచక్షణతో ప్రవర్తిస్తే అదే అద్భుత యోగం
ఉజ్వల బాటకిదే ఆత్మగౌరవరాగం

విజయ తీరాలు స్వాగతమనగ
ఆత్మీయుల కళ్ళల్లో ఆనందం నింపగ
ఆశయాలే ఊపిరిగ
ఆత్మవిశ్వాసమే ఆయుధంగ
జీవించు సన్మార్గంగా..

మత్తును వీడదాం
మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం
మహోన్నతమైన ఆదర్శవంతమైన
జీవితాన్ని నిర్మిద్దాం
మనసారా అనుభవిద్దాం
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *