మంథని, సెప్టెంబర్ 09:
మంథని పట్టణంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్ నందు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయ అరుణ, జెండర్ స్పెషలిస్ట్ బీ. సంస్కృతి, ఎంటీఎస్ ఇ. స్వర్ణలత పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయోవృద్ధుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే టోల్ ఫ్రీ నెంబర్ల ప్రాముఖ్యతను, వాటి వినియోగాన్ని వయోవృద్ధులకు వివరంగా తెలియజేశారు. అలాగే జిల్లా సంక్షేమ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, ఇతర కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం వయోవృద్ధుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మెడగోని రాజమౌళి గౌడ్, ఖాజా మొయినుద్దీన్, దత్త గౌడ్ పాల్గొని వయోవృద్ధులను ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు.

మంథనిలో వయోవృద్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అవగాహన కార్యక్రమం
మంథని, సెప్టెంబర్ 09: మంథని పట్టణంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్ నందు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయ అరుణ, జెండర్ స్పెషలిస్ట్ బీ. సంస్కృతి, ఎంటీఎస్ ఇ. స్వర్ణలత పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయోవృద్ధుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే టోల్ ఫ్రీ నెంబర్ల ప్రాముఖ్యతను, వాటి వినియోగాన్ని వయోవృద్ధులకు వివరంగా తెలియజేశారు. అలాగే జిల్లా సంక్షేమ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, ఇతర కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం వయోవృద్ధుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మెడగోని రాజమౌళి గౌడ్, ఖాజా మొయినుద్దీన్, దత్త గౌడ్ పాల్గొని వయోవృద్ధులను ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు.

