Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భౌగోలు సహా నాలుగు మండలాలకు పోలీసు ఎన్నికల ఇన్చార్జిగా కే వేమారెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భౌగోలు సహా నాలుగు మండలాలకు పోలీసు ఎన్నికల ఇన్చార్జిగా కే వేమారెడ్డి

ప్రతి నామినేషన్ కేంద్రానికి ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో బోగోలు, బోగోలు రూరల్, దగదర్తి, అల్లూరు మండలాలకు పోలీసు ఎన్నికల ఇన్‌చార్జిగా కే. వేమారెడ్డి నియమితులయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను భద్రతా విధుల్లో నియమించినట్లు తెలిపారు.

ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రాంగణంలోకి చేరుకున్న అభ్యర్థులకు సమయం ఎంతైనా నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తామని పోలీసు ఎన్నికల ఇన్‌చార్జి కే. వేమారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

భౌగోలు సహా నాలుగు మండలాలకు పోలీసు ఎన్నికల ఇన్చార్జిగా కే వేమారెడ్డి

భౌగోలు సహా నాలుగు మండలాలకు పోలీసు ఎన్నికల ఇన్చార్జిగా కే వేమారెడ్డి

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *