శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కసా గార్డెన్ డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కమిషనర్ టి. రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి జి. విజయ్ కుమార్ మాట్లాడుతూ భూమి మనకు నీరు, ఆహారం వంటి ముఖ్య వనరులను అందించే జీవనాధారమని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో పెరుగుతున్న పర్యావరణ సంక్షోభం మానవాళికే కాకుండా భూమికే తీవ్రమైన ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూమి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మాధవిలత, యూత్ చైర్మన్ ఎస్.కె. అజరుద్దీన్, స్కౌట్ మాస్టర్లు వెంకటాద్రి, శ్రీహరి, గైడ్ కెప్టెన్ కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.

భూమి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పిలుపు