Tuesday, 29 September 2026
  • Home  
  • భుజం సర్జరీ చేస్తుండగా విషాదం.. రోగి మృతి, ఆసుపత్రి వద్ద బంధువుల ధర్నా
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భుజం సర్జరీ చేస్తుండగా విషాదం.. రోగి మృతి, ఆసుపత్రి వద్ద బంధువుల ధర్నా

నెల్లూరు నగరంలోని విజయమహాల్ గేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరనాథపురానికి చెందిన గయాజ్ బాషా మృతిచెందారు. కుడి భుజం ఫ్రాక్చర్‌కు శస్త్రచికిత్స చేస్తుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి సంభవించిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. అయితే గయాజ్ బాషా కార్డియాక్ అరెస్ట్ కారణంగానే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.