Tuesday, 29 September 2026
  • Home  
  • బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా
- రంగారెడ్డి

బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా

మన్సూరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలను సోమవారం మన్సూరాబాద్‌లోని ఓ కార్యాలయంలో బీసీ నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వట్టే జానయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన, సామాజిక న్యాయం, సమానత్వం కోసం వట్టే జానయ్య చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వట్టే జానయ్య యాదవ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్, సామాజిక ఉద్యమకారిణి నీరజ గౌడ్, జర్నలిస్ట్ ఫోరం మేకల కృష్ణ, బీసీ నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, జక్కుల రాము యాదవ్ తదితర బీసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

మన్సూరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలను సోమవారం మన్సూరాబాద్‌లోని ఓ కార్యాలయంలో బీసీ నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వట్టే జానయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన, సామాజిక న్యాయం, సమానత్వం కోసం వట్టే జానయ్య చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వట్టే జానయ్య యాదవ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్, సామాజిక ఉద్యమకారిణి నీరజ గౌడ్, జర్నలిస్ట్ ఫోరం మేకల కృష్ణ, బీసీ నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, జక్కుల రాము యాదవ్ తదితర బీసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.