ముఖ్యఅతిథిగా ఎం సి వి ప్రసాద్ ప్రసాద్
పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం మండలం
రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో బి. ఫార్మసీ చివరి సంవత్సరం విద్యార్థులకు మంగళవారం విడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకృతి వనం వ్యవస్థాపకుడు ఎం. సి.వి. ప్రసాద్, మరియు గౌరవ అతిధిగా ఏసీబి మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. జయచంద్ర రాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం . సి.వి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ పారిశ్రామిక రంగంలో తన అనుభవాలను పంచుకొని, విద్యార్థులు కష్టపడి పనిచేస్తే విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా జయిచంద్రరాజు మాట్లాడుతూ. యువత నైతిక విలువలను పాటిస్తు సమాజానికి సేవ చేయాలని ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ యం. విరంజన్ బాబు మాట్లాడుతూ విద్యార్ధులు తమ భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోదించాలనిఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరీని ఆకట్టకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .





