Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బిజెపిలోకి పసుపులేటి సుగుణమ్మ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిజెపిలోకి పసుపులేటి సుగుణమ్మ

వార్త ముఖ్యాంశాలు

  • ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో సుగుణమ్మకు పట్టం కట్టిన కావలి ప్రజలు పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి కావలి: నెల్లూరు జిల్లా కావలికి చెందిన పసుపులేటి సుగుణమ్మ భారతీయ జనతా పార్టీలో చేరారు.
  • నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, సురేంద్ర రెడ్డి తదితరుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆమెకు సాదర స్వాగతం పలికారు.
  • ఆమెతో పాటు పసుపులేటి వెంకటేశ్వర్లు తదితరులు కూడా బీజేపీలో చేరారు.

ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో సుగుణమ్మకు పట్టం కట్టిన కావలి ప్రజలు

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

కావలి: నెల్లూరు జిల్లా కావలికి చెందిన పసుపులేటి సుగుణమ్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, సురేంద్ర రెడ్డి తదితరుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఆమెతో పాటు పసుపులేటి వెంకటేశ్వర్లు తదితరులు కూడా బీజేపీలో చేరారు.

ఇటీవల నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ (IVRS) కాల్స్‌లో పసుపులేటి సుగుణమ్మకు కావలి ప్రజలు మద్దతు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరడం కావలి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా పసుపులేటి సుగుణమ్మ మాట్లాడుతూ తాము తిరిగి సొంత గూటికి చేరుకున్నామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సూచించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *