*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 12 వాకాడు మండలం,*
బాలిరెడ్డిపాలెంలోని ముస్లిం కుటుంబాలకు చెందిన కబరస్థాన్ అభివృద్ధికి కొడవలూరు భక్తవత్సల రెడ్డి తన సొంత నిధులతో ముందుకొచ్చారు. పిచ్చి చెట్లతో అడవిని తలపిస్తున్న కబరస్థాన్ ప్రాంతాన్ని శుభ్రపరిచే పనులు చేపట్టడంతో పాటు, కబరస్థాన్‌కు రహదారి సౌకర్యం కల్పించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డిపాలెంలోని ముస్లిం కుటుంబాలు భక్తవత్సల రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనులను ఆయన అనుచరుడు షేక్ షాజీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కబరస్థాన్ అభివృద్ధికి చొరవ చూపిన భక్తవత్సల రెడ్డి సేవలను స్థానికులు అభినందిస్తున్నారు.



