Sunday, 16 August 2026
  • Home  
  • బాలికల మదరసాలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
- తిరుపతి

బాలికల మదరసాలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

చిట్వేలిలోని కుల్లియతుస్సాలిహత్ బాలికల అరబిక్ మదరసాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఖాజా మొహిదీన్, ఎస్‌ఐ వినోద్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థినులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, జాతీయ సమైక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు విద్యలో రాణిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మత సామరస్యం, సోదరభావం, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.