విశాఖపట్నం జిల్లా (పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 2 :: ప్రాజెక్ట్ రిషి, వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో వియ్యంపేట జెడ్పీహెచ్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు పునరుత్పత్తి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, మాసిక ధర్మ పరిశుభ్రత, కెరీర్ మార్గదర్శకంపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో సుమారు 70 మంది బాలికలు పాల్గొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.పి. నాయుడు మాట్లాడుతూ కౌమారదశలో బాలికలు ఎదుర్కొనే శారీరక, మానసిక, హార్మోన్ల మార్పులపై అవగాహన ఎంతో అవసరమన్నారు. ప్రాజెక్ట్ రిషికి చెందిన రిథిక తుమ్మలపెంట, వింధ్య పునరుత్పత్తి ఆరోగ్యం, మాసిక ధర్మ పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు కామేశ్వరి, తెలుగు ఉపాధ్యాయులు రమేష్ ఆరోగ్యకరమైన జీవనశైలి, హక్కులు, బాధ్యతలు, విద్యా అవకాశాలపై వివరించారు. వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం మాట్లాడుతూ ప్రతి బాలిక జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, క్రమశిక్షణ, పట్టుదల, విద్య, నిరంతర కృషితో దానిని సాధించాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రాజెక్ట్ రిషి బృంద సభ్యులు రియా, వృంద, కృషయ్, కరణ్, అర్షిత్తో పాటు వాసవ్య మహిళా మండలి సిబ్బంది వరలక్ష్మి, హేమ, పార్వతి, భవాని, శర్మిల, కామాక్షి, లక్ష్మి, కళావతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. బాలికలకు ఆరోగ్య పరిరక్షణతో పాటు భవిష్యత్ కెరీర్ ఎంపికపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.



