Thursday, 23 April 2026
  • Home  
  • బహదూర్‌పేటలో వైభవంగా సాయిబాబా, సీతారాముల ఆలయ కుంభాభిషేకం
- తిరుపతి

బహదూర్‌పేటలో వైభవంగా సాయిబాబా, సీతారాముల ఆలయ కుంభాభిషేకం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్‌పేట ముత్తరాశి పాలెంలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ సీతారాముల, వరసిద్ధి వినాయక స్వామి ఆలయాల్లో జీర్ణోద్ధారణతో కూడిన కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైశాఖ మాస శుద్ధ సప్తమి సందర్భంగా ఉదయం శుభలగ్నంలో కుంభాభిషేక కార్యక్రమాలు జరిగాయి. గత మూడు రోజులుగా దీక్ష, ప్రతిష్ఠ, శాంతి, పౌష్టిక, తత్వ హోమాలతో పాటు మహాపూర్ణాహుతులు నిర్వహించారు. అనంతరం ప్రాణ ప్రతిష్ఠ, జీవకళా న్యాసం, మహానైవేద్యం, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించి సర్వదర్శనం కల్పించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో, శిరిడి సాయిబాబా వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వహణలో ఈ వేడుకలు జరిగాయి. కుంభాభిషేకం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.