భూపాలపల్లి: భూపాలపల్లి ఎక్సైజ్ సీఐగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న రమ్యారెడ్డి గారికి తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా రమ్యారెడ్డి గారి సేవలను కొనియాడుతూ, భూపాలపల్లిలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారని వారు పేర్కొన్నారు. ఆమె భవిష్యత్ ఉద్యోగ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నేరేడుపల్లి సర్పంచ్ శ్రీపతి తిరుపతి గౌడ్, ఎక్స్ వైస్ ఎంపీపీ తాళ్లపల్లి సురేందర్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, మల్లంపల్లి సొసైటీ అధ్యక్షులు తాళ్లపల్లి సదయ్య గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి మధుసూదన్ గౌడ్, బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొని రమ్యారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.


